గాంధీ ఆసుపత్రికి వచ్చే రోగుల అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూడాలు సమ్మె చేస్తున్న సందర్భంగా సంబంధిత హెచ్ఓడీలతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. ఆర్థోపెడిక్, గైనిక్ మెడిసిన్ సర్జరీలకు సంబంధించి అన్ని విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతో కలిపి ఒక టీంను ఏర్పాటు చేశామని తెలిపారు.
'గాంధీలో అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా చర్యలు'
గాంధీ ఆసుపత్రికి వచ్చే రోగుల అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూడాలు సమ్మె చేస్తున్న సందర్భంగా సంబంధిత హెచ్ఓడీలతో సమావేశం నిర్వహించి సర్జరీలకు సంబంధించి ఒక టీంను ఏర్పాటు చేశామని తెలిపారు.
గాంధీలో అత్యవసర సేవలకు ఆటకం లేకుండా చర్యలు
ప్రతిరోజూ అన్ని విభాగాల్లో ఆ టీమ్ తనిఖీచేస్తున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ల సమ్మె సందర్భంగా విధి నిర్వహణ జాబితాను కూడా రూపొందించినట్లు వివరించారు. నిన్న రాత్రి రెండు గంటల వరకు హాస్పిటల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు కాబట్టి, ఇకనైనా రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జూడాలు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : వరదలో కొట్టుకుపోయిన ఆటో, డ్రైవర్ సేఫ్