గాంధీ ఆస్పత్రి పొరుగుసేవల సిబ్బంది సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు విధుల్లోకి రామని తేల్చిచెప్పారు. ఔట్‌సోర్సింగ్ నర్సులు, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో సమ్మెకు దిగవద్దని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేసినా.. ఉద్యోగులు సమ్మెకే మొగ్గుచూపారు.
నిరవధిక సమ్మెలో గాంధీ ఆస్పత్రి పొరుగుసేవల సిబ్బంది - undefined
గాంధీ ఆస్పత్రి పొరుగు సేవల సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. సంవత్సరాలుగా పనిచేస్తున్నా నామమాత్రపు వేతనాలు చెల్లిస్తున్నారని ఆరోపిస్తూ సేవలు నిలిపివేశారు. మంగళవారం ధర్నాకు దిగిన ఉద్యోగులు ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో సేవలు ఆపేశారు. సమ్మెలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది ఉన్నారు.
ఆందోళన చేస్తున్న గాంధీ ఆస్పత్రి పొరుగుసేవల సిబ్బంది
ఉదయం నుంచి విధులు బహిష్కరించి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వీరి సమ్మెతో సౌకర్యాలు కల్పించే వారు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ, ఇతర వార్డుల్లో రోగులకు సేవలక తీవ్ర విఘాతం ఏర్పడింది.
ఇదీ చూడండి :ఆసిఫాబాద్ తిర్యాని అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు