తెలంగాణ

telangana

ETV Bharat / state

నేను ఎప్పటికీ ప్రజాపక్షమే: గద్దర్​ - hydrabad

యువతరమంతా విధిగా ఓటువేసి దేశ భవిష్యత్​ మార్చాలని ప్రజాగాయకుడు గద్దర్ కోరారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్​ను కలిసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరానన్నారు.

జీవితాంతం ప్రజలకోసమే పాడుతా

By

Published : Mar 28, 2019, 6:29 PM IST

Updated : Mar 28, 2019, 7:55 PM IST

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గద్దర్​ అన్నారు. ఉగ్రవాదం నుంచి దేశాన్ని కాపాడాలని అన్నారు. తనపై హత్యాయత్నం జరిగిందని చెప్పడానికి కేసీఆర్ 5 నిమిషాల సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో లౌకిక పార్టీ అధికారంలోకి రావాలని... నయా భూస్వామ్య విధానంతో ఉన్న పార్టీలకు తాను వ్యతిరేకమని గద్దర్ వ్యాఖ్యానించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా, నిజాయితీగా ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

జీవితాంతం ప్రజలకోసమే పాడుతా
Last Updated : Mar 28, 2019, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details