సాధారణ పరిపాలనా శాఖ అధికారులు, సిబ్బందికి రాత్రి విధులు వేయడంపై ఉద్యోగులు, అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కలిసిన సచివాలయ సంఘం ప్రతినిధులు, ఉద్యోగులు ఈ మేరకు వినతిపత్రం అందించారు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటల పాటు విధులు నిర్వహించేందుకు తాము సిద్ధమని ఉద్యోగులు తెలిపారు. అయితే ప్రతి రోజూ రాత్రి విధులు అవసరం లేదని అన్నారు.
జీఏడీ అధికారులు, సిబ్బందికి రాత్రి విధులపై అభ్యంతరం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను సచివాలయ సంఘం ప్రతినిధులు, ఉద్యోగులు కలిశారు. జీఏడీ అధికారులు, సిబ్బందికి రాత్రి విధులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అత్యవసర వేళల్లో 24 గంటలపాటు విధులు నిర్వహిస్తామని ఉద్యోగులు తెలిపారు.
జీఏడీ అధికారులు, సిబ్బందికి రాత్రి విధులపై అభ్యంతరం
మహిళా ఉద్యోగులు కూడా రాత్రి వరకు విధుల్లో లేకుండా చూడాలని కోరారు. అవసరాల రీత్యా ప్రతిరోజూ ఇద్దరు జీఏడీ అధికారులు, సిబ్బంది రాత్రి విధుల్లో ఉండాలని సీఎస్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఇవాళ ఆయనకు వినతిపత్రం అందించారు. ఉద్యోగుల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ సోమేష్ కుమార్ వారికి తెలిపారు.