గ్రేటర్ హైదరాబాద్ కూడళ్లలో అవాంతరాలు లేకుండా వాహనాలు ప్రయాణించాలనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ 2015లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చింది. 25 వేల కోట్ల అంచనాతో ప్రతిపాదించిన ప్రాజెక్టులు కొన్ని పట్టాలెక్కగా... మరికొన్ని నత్తనడకన సాగుతున్నాయి. స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ద్వారా బాండ్లు జారీచేసి అధికారులు 395 కోట్లు సమీకరించారు. ఈ నిధులు అయిపోయిన తర్వాత పనుల్లో వేగం తగ్గిపోయింది.
ఎల్బీనగర్‌లో కామినేని కూడలి-బైరామల్‌గూడ దిశలో చేపట్టిన అండర్‌పాస్ మార్గం పనులు రెండేళ్లయినా 50 శాతం కూడా పూర్తికాలేదు. షేక్‌పేట బృందావన కాలనీ నుంచి రాయదుర్గం మల్కం చెరువు వరకు ఏడాదిన్నర క్రితం మొదలైన పైవంతెన పనులు నెమ్మదించాయి. మొత్తం 73 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా 40 మాత్రమే పూర్తయ్యాయి. భూసేకరణ జరగకపోవడం, నిధుల కొరతతో ఇక్కడ 30 శాతం పనులే జరిగాయి.
నిధులు లేక నిలిచిన వ్యూహాత్మక రహదారులు - Funded or stalled strategic highways
గ్రేటర్ హైదరాబాద్‌లో మౌలిక సౌకర్యాల స్థాయిని పెంచే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం-ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. నిధులు లేక, ఆశించిన స్థాయిలో భూసేకరణ జరగక అభివృద్ధి పనుల్లో ప్రతిష్టంభన నెలకొంది.
నిధులు లేక నిలిచిన వ్యూహాత్మక రహదారులు
ఇవీ చూడండి: దేశవ్యాప్తంగా వర్షబీభత్సం.. 114కు చేరిన మృతులు
Last Updated : Aug 11, 2019, 7:55 AM IST
TAGGED:
గ్రేటర్ హైదరాబాద్