తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంటర్‌ విద్యార్థులకు 100 శాతం సిలబస్‌' - full syllabus for Inter students

ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు 100 శాతం సిలబస్‌ అమల్లో ఉంటుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ వెల్లడించారు. వివరాలు త్వరలో ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని స్పష్టం చేశారు.

'ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్‌ విద్యార్థులకు 100 శాతం సిలబస్‌'
'ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్‌ విద్యార్థులకు 100 శాతం సిలబస్‌'

By

Published : Jun 24, 2022, 7:09 PM IST

ఇంటర్మీడియట్‌లో ఈ విద్యాసంవత్సరం నుంచి మళ్లీ పూర్తి స్థాయి సిలబస్‌ అమలు కానుంది. రెండేళ్లుగా కరోనా వల్ల తరగతులు సరిగా నిర్వహించలేకపోవడంతో 30 శాతం సిలబస్‌ను తొలగించారు. దానికి అనుగుణంగానే ఎంసెట్‌లోనూ 70 శాతం సిలబస్‌ నుంచే పరీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులు కుదుట పడటంతో పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు 100 శాతం సిలబస్‌ అమల్లో ఉంటుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ వెల్లడించారు. వివరాలు త్వరలో ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details