ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ(ఫిక్కీ) సంతృప్తి వ్యక్తం చేసింది. లక్డీకాపుల్‌లోని ఎఫ్‌టీసీసీఐ కార్యాలయంలో బడ్జెట్‌పై వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
'గ్రామీణ భారతానికి ఈ బడ్జెట్ ఊతమిస్తోంది' - కేంద్ర బడ్జెట్-2020పై ఫిక్కీ స్పందన
ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్ పట్ల ఫిక్కీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సారి వ్యవసాయానికి, విద్య, వైద్యానికి ఎక్కువ ప్రధాన్యత ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్-2020పై ఫిక్కీ స్పందన
ఈసారి బడ్జెట్లో వ్యవసాయం, విద్య, వైద్యానికి ఎక్కువ ప్రధాన్యమిచ్చారని తద్వారా గ్రామీణ అభివృద్ధికి దోహదపడే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. అన్ని అంశాలను, రంగాలకు సమప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. గ్రామాల్లోకి ఫైబర్ నెట్ అందుబాటులోకి వస్తే వారు మరింత చైతన్యవంతులవుతారని పేర్కొన్నారు. బడ్జెట్లో ఐటీ రంగానికి ప్రధాన్యతనిచ్చారని తెలిపారు.
TAGGED:
FTCCI ON CENTRAL BUDGET