తెలంగాణ

telangana

ETV Bharat / state

డీకే అరుణ ఏ స్థానం నుంచి పోటీ చేయనున్నారు ?

ఆమె కాంగ్రెస్ సీనీయర్ నేత. మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం హస్తం గడ్డు కాలం ఎదుర్కొంటోంది. అందుకే చేతి పార్టీని వదిలి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​షా సమక్షంలో కమల తీర్థాన్ని పుచ్చుకున్నారు డీకే అరుణ.

డీకే అరుణ పోటీ చేయబోయే స్థానంపై నేడు స్పష్టత రానుంది

By

Published : Mar 20, 2019, 1:58 PM IST

అమిత్​షా సమక్షంలో కమల తీర్థాన్ని పుచ్చుకున్న డీకే అరుణ.
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో డీకే అరుణ ఆ పార్టీలో చేరారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, డీకే అరుణ భేటీ అయ్యారు. అరుణ వంటి సీనియర్ నేతలు తమ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని లక్ష్మణ్‌ హర్షం వ్యక్తం చేశారు.

డీకే అరుణ బాటలో ఇంకెందరో ?

కాంగ్రెస్ కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలపై ప్రజలు విసుగు చెందారని లక్ష్మణ్​ఆరోపించారు. భాజపాలో చేరేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నారని ఆయన స్పష్టం చేశారు. డీకే అరుణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇవాళ స్పష్టత వస్తుందని తెలిపారు.

ఇవీ చూడండి :తెరాస గూటికి కొల్లాపూర్​ ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details