అంతరించిపోతున్న స్వర్ణకార కళలను నూతన విధానాలతో ప్రోత్సహించడమే తమ లక్ష్యమని విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు కిషన్ రావు స్పష్టం చేశారు. సికింద్రాబాద్లోని విశ్వకర్మ భవన్లో తెలంగాణ జిల్లాలోని వృత్తి పట్ల ఆసక్తి ఉన్న స్వర్ణకళాకారులకు ఉచితంగా కాస్టింగ్, మోల్డింగ్ చేతి కళలకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ విశ్వ బ్రాహ్మణ కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రెండు వారాలు 30 మందికి పైగా శిక్షణ తీసుకుంటున్నారని, వారికి ఉపాధి అవకాశాలనూ కల్పిస్తామని చెప్పారు. స్టోన్ ఫిట్టింగ్, పాలిషింగ్ వర్క్ నేర్పించడం వల్ల బెంగాలీ కళాకారుల తరహాలో మల్టి నేషనల్ షో రూమ్లలో విక్రయించే అవకాశం ఉందని కిషన్ రావు అన్నారు. ఇప్పుడున్న పోటీ యుగంలో యువతను ప్రోత్సహించి స్వర్ణకారుల రంగానికి పునర్వైభవం తీసుకువస్తామన్నారు. తెలంగాణ విశ్వబ్రాహ్మణ కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్తో, తెలంగాణ ప్రభుత్వమూ దీనికి అన్ని విధాలా సహకరిస్తుంని విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు పేర్కొన్నారు. తాము పోటీ ప్రపంచంలో నిలవాలంటే ప్రభుత్వ ప్రోత్సహం కావాలని వృత్తి నేర్చుకుంటున్న వారన్నారు. తమకు ఇక్కడ నేర్చుకోవడం సంతోషంగా ఉందని ఉచితంగా శిక్షణ ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
స్వర్ణకార కళకి ప్రోత్సాహం...ఉచిత శిక్షణ - మల్టి నేషనల్ షో రూమ్
మరుగున పడుతున్న స్వర్ణకార కళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్రంలో వృత్తి పట్ల ఆసక్తి ఉన్న 30 మందికి సికింద్రాబాద్లోని విశ్వకర్మ భవన్లో ఉచితంగా శిక్షణ అందిస్తోంది తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం. స్వర్ణ కళాకారులకు ఉపాధి కల్పించటం, కళకి పునర్వైభవం తీసుకొచ్చేలా ఈ కార్యక్రమం చేపట్టింది.
విశ్వకర్మ కళకి ప్రోత్సాహం...ఉచిత శిక్షణ