లాక్‌డౌన్ కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కరోనా రోగులకు మేమున్నామంటూ చేయూతనందిస్తున్నారు ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన తెరాస యువజన నాయకులు ముఠా జైసింహా. వైరస్ బాధితులకు ప్రతిరోజు రెండు పూటలా పౌష్టికాహారాన్ని అందిస్తూ తన మానవత్వాన్ని చాటుతున్నారు.
తెరాస యువజన నేత దాతృత్వం.. - free food distribution to corona victims latest news
కరోనా విపత్తు వేళ వైరస్ బాధితులకు పలువురు అండగా నిలుస్తున్నారు. తమకు చేతనైన సాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు. కొందరు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తుండగా.. మరికొందరు ఉచితంగా పౌష్టికాహారం అందిస్తూ మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు.
ఉచితంగా ఆహారం పంపిణీ
ముషీరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బోలక్‌పూర్, డీబీఆర్ మిల్స్, గగన్ మహాల్, బైబిల్‌హౌజ్, దుర్గాభాయ్ దేశ్‌ముఖ్, ఫీవర్ ఆసుపత్రుల్లో కరోనాతో ఇబ్బందులు పడుతున్న వారికి భోజనాన్ని అందిస్తున్నట్లు ముఠా జైసింహా తెలిపారు. రోజుకు సుమారు 150 మంది కొవిడ్ రోగులు, వారి బంధువులకు ఆహారంతో పాటు మందులు, శానిటైజర్లు, మాస్కులు అందజేస్తున్నామని వివరించారు. హోం ఐసోలేషన్‌లో ఉండి ఆహారం అవసరమైన వారు 7673959317 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.