ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను కల్వకుంట్ల రాష్ట్రంగా మారుస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ ఆరోపించారు. హెచ్సీఏలో ఆయన కుటుంబ సభ్యులను దించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్లో తన నామినేషన్ను లోధా కమిటీ సిఫారుసులు అడ్డంపెట్టుకుని తిరస్కరించారని తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఇలా చేయండం సాధ్యంకాదని చెప్పారు. హైదరాబాద్ క్రికెట్ కోసం ఎన్నో చేశానని... కానీ ప్రస్తుతం నిధులు, స్పాన్సర్ షిప్ పోయిందని అన్నారు.
'కేసీఆర్ కుటుంబం క్రికెట్లోకి దిగుతోంది' - cricket
కల్వకుంట్ల కుటుంబం రాజకీయాల్లోనుంచి క్రికెట్లోకి ప్రవేశిస్తుందని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ తాను నామినేషన్ వేస్తే తప్పుడు ఆధారాలతో తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కేసీఆర్ కుటుంబం రాజకీయాల్లోంచి క్రికెట్లోకి దిగుతోంది'