తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్​ను కలిసిన ఛత్రపతి శివాజీ వారసుడు - తెలంగాణ అభివృద్దిని ప్రశంసించిన శంభాజీ రాజే

Shambhaji Raje meets CM KCR : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మహారాష్ట్రలోనూ జరిగితే బాగుంటుందని మాజీ ఎంపీ శంభాబీ రాజే అభిప్రాయపడ్డారు. ఛత్రపతి శివాజీ 13వ వారసుడైన శంభాజీ రాజే సీఎం కేసీఆర్‌ను హైదరాబాద్ ప్రగతి భవన్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. దేశ రాజకీయాలపై, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు.

cm kcr
సీఎం కేసీఆర్‌

By

Published : Jan 27, 2023, 10:14 AM IST

Shambhaji Raje meets CM KCR: తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలోనూ అమలు చేస్తే బాగుంటుందని ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, కొల్హాపూర్ సంస్థాన సాహూ మహరాజ్ మనవడు, మాజీ ఎంపీ శంభాజీ రాజే ఆకాంక్షించారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో శంభాజీ రాజే మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై కేసీఆర్‌తో శంభాజీ రాజే చర్చించారు.

మాజీ ఎంపీ శంభాజీ రాజేతో భేటీ అయిన సీఎం, మంత్రులు

తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కేసీఆర్‌ను శంభాజీ రాజే అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తే బాగుంటుందని ఛత్రపతి శంభాజీ రాజే తన ఆకాంక్షను వెల్లడించారు. అద్భుతమైన తెలంగాణ ప్రగతి నమూనా మహారాష్ట్ర సహా దేశమంతటా విస్తరించాలని శంభాజీ రాజె అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రత, దేశ ప్రజల అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా వినూత్న అజెండా ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్, శంభాజీ రాజే తెలిపారు.

ఛత్రపతి శివాజీ నుంచి సాహూ మహారాజ్ వరకు సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా అందించిన పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. శివాజీ, సాహూ మహరాజ్ స్ఫూర్తితోనే తెలంగాణలో కుల, మత వివక్షకు తావు లేని పాలన కొనసాగుతోందని సీఎం పేర్కొన్నారు. రాజర్షి సాహు ఛత్రపతి పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌కు.. శంభాజీ రాజె అందించారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, మధుసూదనచారి, పల్లా రాజేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details