రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నేత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హోంశాఖ మాజీ మంత్రి నాయిని జయంతి సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నాయిని జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నాయిని చిత్ర పటం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.
ముషీరాబాద్‌లో మాజీ మంత్రి నాయిని జయంతి వేడుకలు - హోంశాఖ మాజీ మంత్రి నాయిని జయంతి వేడుకలు
ముషీరాబాద్ నియోజకవర్గంలో హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి జయంతి వేడుకలను తెరాస నేతలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు.
nayeni narsimhareddy birth annevercery
కార్యక్రమంలో పాల్గొన్న నాయిని అల్లుడు మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి... ముషీరాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బందికి శానిటైజర్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రంలో పలువురు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:అనవసరంగా బయటకొస్తే కేసులే..