తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది: విద్యాసాగర్‌ రావు - హైదరాబాద్ తాజా వార్తలు

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌ రావు పాల్గొన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా చాలా మంది సేవచేస్తున్నారని ఆయన అన్నారు.

Vidyasagar Rao
విద్యాసాగర్‌ రావు

By

Published : Apr 3, 2022, 10:44 PM IST

దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉగాది విశిష్ఠ సేవా పురస్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ, అమెరికా, ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్, కెనడా ఫిలంత్రోఫీక్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో పురస్కారోత్సవం నిర్వహించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా సమాజంలో చాలా మంది సేవ చేస్తున్నారని విద్యాసాగర్ రావు అన్నారు. ఇలాంటి సంస్థలు మరిన్ని ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు రాంచందర్​రావు, బాబు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: బంజారాహిల్స్ పబ్​లో దొరికిన వారందరిని కఠినంగా శిక్షించాలి: బీజేవైఎం

ABOUT THE AUTHOR

...view details