తెలంగాణ

telangana

ఛాతి నొప్పితో మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ డీజీపీ ప్రసాదరావు మరణించారు. ఛాతి నొప్పితో అమెరికాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బయ్యారపు ప్రసాదరావు 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అనిశా డీజీగా, ఆర్టీసీ ఎండీగా, హోంశాఖలో కార్యదర్శిగా ప్రసాదరావు సేవలందించారు.

By

Published : May 10, 2021, 9:52 AM IST

Published : May 10, 2021, 9:52 AM IST

Updated : May 10, 2021, 10:34 AM IST

dgp prasadarao
dgp prasadarao

మాజీ డీజీపీ డాక్టర్ బి.ప్రసాదరావు కన్నుమూశారు. అమెరికాలో ఉంటున్న ఆయనకు ఛాతి నొప్పి రావడంతో అర్ధరాత్రి ఒంటి గంటకు తుదిశ్వాస విడిచారు. ఛాతి నొప్పిరావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ ఆస్పత్రి చేరుకునేలోపే ప్రసాదరావు మరణించారు. 1979 ఐపీఎస్ బ్యాచ్​కు చెందిన ప్రసాదరావు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో డీజీపీగా, అవినీతి నిరోధక శాఖకు డైరెక్టర్ జనరల్​గా సేవలందించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అంతర్గత భద్రత విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్​గా కూడా ప్రసాదరావు బాధ్యతలు నిర్వహించారు. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన బయ్యారపు ప్రసాదరావు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పలు జిల్లాలో పనిచేశారు. 1977లో భౌతిక శాస్త్రంలో ఎంఎస్సీ చదివిన ప్రసాదరావుకు భౌతికశాస్త్రంలో ప్రయోగాలు చేయడమంటే ఆసక్తి. ఆంగ్ల భాషలో యువత పట్టు సాధించేందుకు ప్రసాదరావు వర్డ్ పవర్ టు మైండ్ పవర్ అనే పుస్తకాన్ని రచించారు. ప్రసాదరావుకు భార్య సౌమిని, కుమారుడు వికాస్, కోడలు సౌమ్య, నెలల వయసున్న మనవడు ఉన్నారు.

ఇదీ చదవండి:పల్లెలను కబళిస్తున్న కరోనా మహమ్మారి

Last Updated : May 10, 2021, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details