ఆంధ్రా వైపు నుంచి వచ్చే అంబులెన్సులను నిబంధనల పేరిట తెలంగాణ పోలీసులు ఆపడం పట్ల… ఏపీ మాజీ మంత్రి నెట్టెం రఘురాం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఆంబులెన్సులు నిలిపివేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఆంధ్రా నుంచి వచ్చే అంబులెన్సులను ఆపడం అమానుషం' - ఆంబులెన్సులప ఆపడం పట్ల ఏపీ మాజీ మంత్రి నెట్టెం రఘురాం అభ్యంతరం
ఆంధ్రా నుంచి వచ్చే అంబులెన్సులను నిబంధనల పేరిట తెలంగాణ పోలీసులు ఆపడం పట్ల ఏపీ మాజీ మంత్రి నెట్టెం రఘురాం అభ్యంతరం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం వచ్చే రోగులను వెనక్కు పంపడం అమానుష చర్యగా అభివర్ణించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ap former minister nettem raghuram
విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉందని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్తున్న వారిని నిబంధనల పేరిట వెనక్కి పంపడం అమానుష చర్యగా అభివర్ణించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.