ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేసే నర్సరీని ఆ గ్రామం పేరు - హరితహారం నర్సరీగా పిలవాలని అధికారులు నిర్ణయించారు. జులైలో ప్రారంభం కానున్న ఐదో విడత హరితహారం ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా సచివాలయంలో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఏ శాఖ నర్సరీని నిర్వహిస్తున్నా పేరు మాత్రం గ్రామ పంచాయతీ పేరు మీదే ఉండాలని సూచించారు. గ్రామ స్థాయిలో నర్సరీల ఏర్పాటు, ఉపాధి హామీ నిధులతో అనుసంధానం, ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోత్సాహంపై చర్చించారు. జిల్లాల వారీగా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలు సమావేశమై ఐదో విడత హరితహారంపై కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
ఐదో విడత హరితహారంపై దృశ్య మాధ్యమ సమీక్ష
గ్రామ స్థాయిలో నర్సరీల ఏర్పాటు త్వరితగతిన జరగాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ మిశ్రా అధికారులకు సూచించారు. ఐదో విడత హరితహారంపై సచివాలయంలో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
అధికారులతో సమీక్ష