తెలంగాణ

telangana

ETV Bharat / state

'సర్వే చేయండి... ఆగం చేయకండి'

తాతలు, ముత్తాతల కాలం నుంచి ఆ భూములు సాగు చేసుకొని బతుకున్నారు. ఇప్పుడేమో... అటవీశాఖ అధికారులు వచ్చి అవి ప్రభుత్వ భూములని, అందులో ఏమీ పండించకూడదని ఆంక్షలు విధిస్తూ... తమ జీవనానికి ఆటంకం కల్గిస్తున్నారంటూ ఆ తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Aug 4, 2019, 7:23 PM IST

'సర్వే చేయండి... ఆగం చేయకండి'

'సర్వే చేయండి... ఆగం చేయకండి'

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం లోక్యా తండావాసుల బతుకు భారంగా సాగుతోంది. ఇన్నాళ్లు తమ తాతల నుంచి వచ్చిన భూములను సాగు చేసుకుంటూ... జీవనం సాగించారు. వారికి పట్టా పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళనలో వారికి పట్టాపాసు పుస్తకాలు రాలేదు. వాటి కోసం ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఆ భూములు తమకి చెందినవని వాటి సాగు చేయడం కుదరదని చెప్పారు.

గత ప్రభుత్వాలు కేటాయించిన ఆ భూములను అటవీ సిబ్బంది అడ్డగిస్తూ సర్వే చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంట కాలం ప్రారంభమైనప్పటికీ... సర్వే చేయనందున సాగు చేయలేకపోతున్నామన్నారు. పంటలు పండించే వీలులేక చేసేందుకు వేరే పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నదాతలు వాపోతున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రెవెన్యూ అధికారులతో భూమి సర్వే చేయించాలని కోరుతున్నారు. తమ భూములు తమకు ఇప్పించి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి: తెలంగాణలో యోగా యూనివర్సిటీ స్థాపనకు కృషిచేస్తా: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details