ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో ఉండే.. భద్రత హెల్ప్‌లైన్ నంబర్ 182ను, రైల్ మదద్ నంబర్ 139లో విలీనం చేసినట్లు భారత రైల్వేశాఖ ప్రకటించింది. సింగిల్ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఒకే నెంబర్ ఉండడంతో.. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రయాణికులకు మరింత సులువుగా ఉంటుందని రైల్వేశాఖ పేర్కొంది. మొబైల్ ఫోన్, వెబ్ ద్వారా ప్రయాణికులకు అవసరమైన సమాచారం చేరవేస్తూ.. సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తామని వివరించింది.