హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో ఆహారం తీసుకున్న తర్వాత అస్వస్థతకు గురైన కుటుంబం హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో రావి నారాయణ, శ్రీవిద్యతో పాటు వాళ్ల కుమారులు వరుణ్, విహాన్లను కిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. అప్పటికే ఎనిమిది నుంచి పది సార్లు వాళ్లకు వాంతులు అయ్యాయని చెప్పారు. పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు వారిని మెడికల్ స్టెప్ డౌన్ యూనిట్‌కు తరలించారు. ఆ నలుగురిలో విహాన్ పరిస్థితి అప్పటికే విషమించినట్లు వైద్యులు చెప్పారు. 45 నిమిషాలపాటు సీపీఆర్ అందించామని... కానీ ఫలితం లేదని వైద్యులు వెల్లడించారు.
ఆ ముగ్గురి ఆరోగ్యం నిలకడగానే ఉంది: వైద్యులు - hotel food
బేగంపేట్‌లోని ఓ హోటల్లో అనారోగ్యానికి గురైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబ సభ్యుల హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. మృతి చెందిన రెండేళ్ల చిన్నారికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగిందని తెలిపారు.
వరుణ్ అనే అబ్బాయిని పీఐసీయూకి తరలించినట్లు తెలిపారు. మిగిలిన వారికి ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీ బయోటిక్స్‌తో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని... డీహైడ్రేషన్ కు గల కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగిందని తాము కూడా అనుమానిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పరీక్షల కోసం రక్త నమూనాలను పంపించి వాటి ఫలితాల కోసం వేచి చూస్తున్నామని పేర్కొన్నారు. విహాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు... అతనికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం కూడా జరిగిందని తెలిపారు.
ఇవీ చూడండి:వీసా కోసం వచ్చి బాలుడి మృతి... ఆస్పత్రిలో కుటుంబం