ఇమ్యునిటీని పెంచే వీటిని ఎలా తయారుచేయాలంటే...
- యాపిల్‌తో..
కావాల్సినవి: యాపిల్- ఒకటి, అల్లం- చిన్న ముక్క, నిమ్మకాయ- ఒకటి.
తయారీ:యాపిల్, అల్లాన్ని శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వీటన్నింటినీ కలిపి జ్యూస్ తీసుకోవాలి. జ్యూస్‌ని వడకట్టిన తర్వాత చివరిగా నిమ్మరసం పిండుకోవాలి.
- క్యారెట్‌తో..
కావాల్సినవి: క్యారెట్లు- మూడు, నిమ్మకాయ- ఒకటి, అల్లంముక్క- ఒకటి, పసుపు- అర టీస్పూన్.
తయారీ: క్యారెట్, అల్లాన్ని శుభ్రంగా కడిగి తొక్క తీసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా కోసుకుని జ్యూసర్‌లో వేయాలి. వడకట్టగా వచ్చిన రసానికి పసుపు, నిమ్మ రసం కలపాలి.
- ఆకుకూరలతో..
కావాల్సినవి: పాలకూర- గుప్పెడు, పుదీనా- గుప్పెడు, నిమ్మకాయ- ఒకటి, తేనె - కొద్దిగా.
తయారీ: పాలకూర, పుదీనాను శుభ్రంగా కడగాలి. వీటిని జ్యూసర్‌లో వేసి జ్యూస్ చేసుకోవాలి. వడకట్టిన తర్వాత నిమ్మరసం, తేనె వేసి కలుపుకోవాలి.
- బీట్‌రూట్‌తో..