అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో ఎథికల్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అలాగే ఆసంస్థ వ్యవస్థాపకులు రఘువీర్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఫీవర్ ఆసుపత్రి కి 2అంబులెన్స్న్లను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు
ఎథికల్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమాజానికి కనిపించే ప్రత్యక్ష దైవం వైద్యులని అన్నారు ఎథికల్ హెల్త్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రఘువీర్. అలాంటి వారికి సమాజంలో తగిన గౌరవ మర్యాదలు ఇస్తూ... కృతజ్ఞతా భావంతో కలిగి ఉండాలే తప్ప దాడులు చేయడం లాంటివి తగదని పేర్కొన్నారు.
Hyderabad latest news
సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్న దృక్పథంతో వృద్ధులను దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం ఎథికల్ హెల్త్ కేర్ ఫౌండేషన్ను స్థాపించడం జరిగిందని రఘువీర్ పేర్కొన్నారు. కరోనా నివారణ కోసం నిరంతరం కష్టపడుతున్న పోలీసులు, వైద్యులు, జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి శానిటైజర్స్, మాస్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు.