కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి వద్ద అన్నదాన వితరణ నిర్వహిస్తున్నారు. ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నంద కిశోర్ వ్యాస్ బిలాల్, కేసీఆర్ సేవా సమితి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, తెలంగాణ జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో గత ఏడు రోజులుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కోఠి ఆస్పత్రి వద్ద పేదలకు అన్నదాన వితరణ - హైదరాబాద్లో అన్నదానం
హైదరాబాద్ కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి వద్ద రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి అన్నదానం చేశారు. పేదల ఆకలి తీర్చడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
తెలంగాణ వార్తలు
రోజూ 15వందల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపుపై లాక్డౌన్లో ఆకలితో అలమట్టిస్తున్న నిరుపేదల ఆకలి తీర్చడం అభినందనీయమని ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.రాజ్యలక్ష్మి అన్నారు.
ఇదీ చూడండి:రైతుల ఆశలపై నీళ్లు చల్లిన ఎత్తిపోతల పథకాలు