హైదరాబాద్‌లో వరద సహాయం అందక బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. గడ్డిఅన్నారం, చైతన్యపురి డివిజన్లలోని కోదండరామ్‌నగర్, సీసాలబస్తీ, వివేకానందనగర్ కాలనీ, హనుమాన్‌నగర్, సాయినగర్, శారదానగర్ కాలనీ, ద్వారకపురం, విద్యుత్‌నగర్, వికాస్‌నగర్‌లో ధర్నా నిర్వహించారు. వీరికి భాజపా నాయకులు మద్దతిచ్చారు.
ఆర్థిక సహాయం కోసం వరద బాధితుల ఆందోళన - వరద బాధితుల ఆందోళన
ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వారికి అందించే ఆర్థిక సహాయం.. తమకు అందడం లేదని వరద బాధితులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో ధర్నా నిర్వహించారు. వీరికి భాజపా నాయకులు మద్దతిచ్చారు.
ఆర్థిక సహాయం కోసం వరద బాధితుల ఆందోళన
కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే, కార్పొరేటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రూ.10 వేల ఆర్థిక సాయాన్ని బాధితులకు కాకుండా ఇతరులకు ఇస్తున్నారని వారు ఆరోపించారు. నష్టపోయిన వారందరికీ పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పెద్ద మనసుతో సాయం అందిస్తే.. స్థానిక నాయకులు మాత్రం పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:వరద సాయం కోసం నగరంలో పలుచోట్ల బాధితుల ఆందోళన