తెలంగాణ

telangana

ETV Bharat / state

సాయం కోసం ముంపు ప్రాంత బాధితుల ఆందోళన

వరద ముంపు ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న పది వేల రూపాయల ఆర్థిక సహాయం కోసం బాధితులు ఆందోళనకు దిగారు. గోశామహల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు అబిడ్స్​లోని జీహెచ్​ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.

సాయం కోసం ముంపు ప్రాంత బాధితుల ఆందోళన
సాయం కోసం ముంపు ప్రాంత బాధితుల ఆందోళన

By

Published : Oct 29, 2020, 3:13 PM IST

ముంపు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సాయం తమకు ఇంకా అందలేదని... బాధితులు ఆందోళనకు దిగారు. గోశామహాల్​ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలనకు చెందిన బాధితులు అబిడ్స్​లోని జీహెచ్​ఎంసీ సర్కిల్​ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులకు... ముంపు బాధితులకు వాగ్వాదం జరిగింది. బాధితుల ఆందోళనతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారి ప్రాంతాలకే వచ్చి సాయం పంపిణీ చేస్తామని జీహెచ్​ఎంసీ అధికారులు హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించారు. మూడు రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తమను పట్టించుకోవడం లేదని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

మా ప్రాంతంలో కొందరికి డబ్బులు ఇచ్చారు... కొందరికి ఇవ్వడం లేదు. అధికారులను అడిగితే మేమివ్వం మీరేమి చేసుకుంటారో చేసుకోండి. ఏ సార్​ను కలిసి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారు. ఇళ్లను, పిల్లలను వదులుకొని సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరు. మా పరిస్థితి చూసైనా సాయం అందించండి.

-సరళ, ముంపు ప్రాంత బాధితురాలు

సాయం కోసం ముంపు ప్రాంత బాధితుల ఆందోళన

ఇదీ చూడండి:భాగ్యనగరం ఊపిరి పీల్చుకుంది వారి వల్లనే...

ABOUT THE AUTHOR

...view details