హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు వరద కొనసాగుతోంది. ఉస్మాన్‌సాగర్ జలాశయంలోకి 1200 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 200 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1785.60 అడుగులకు చేరింది.
HYD FLOODS: హైదరాబాద్ జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద.. - hyderabad floods
వర్షాలు తగ్గుముఖం పట్టినా హైదరాబాద్ జంట జలాశయాలకు మాత్రం ఇంకా వరద కొనసాగుతూనే ఉంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్యాయర్లు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో నీటిని మూసీలోకి వదులుతున్నారు.
హైదరాబాద్ జంట జలాశయాలు
హిమాయత్‌సాగర్ జలాశయంలోకి 1800 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. గేట్ల ద్వారా 2,400 క్యూసెక్కుల నీరు మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.60 అడుగులకు చేరింది. వర్షాలు తగ్గినా జలాశయాల్లోకి వరద ఇంకా కొనసాగుతోంది.
ఇదీ చదవండి:WEATHER REPORT: రాష్ట్రంలో రాగల మూడురోజులు ఆ జిల్లాల్లో వర్షాలే!