హైదరాబాద్ లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌లో అపహరణకు గురైన ఐదేళ్ల చిన్నారి కథ సుఖాంతమైంది. నిన్న మధ్యాహ్నం లంగర్‌హౌస్ పీఎస్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో ఐదేళ్ల బాలికను ఓ వ్యక్తి అపహరించాడు. పాఠశాల నుంచి బయటకు వచ్చే సమయంలో అక్కడే ఉన్న వృద్ధుడు పాపను ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు పాపను అపహరించిన వ్యక్తి ఆచూకీని కనిపెట్టారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన ఫకీరప్పగా గుర్తించారు. పాపను కొడంగల్ పోలీస్‌స్టేషన్‌కు సీఐ నాగేశ్వర్రావు తీసుకొచ్చారు. పాప ఒంటిపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించగా... చిన్నారికి చికిత్స చేయించారు.
'లంగర్ హౌస్ పాప కొడంగల్‌లో దొరికింది...'
హైదరాబాద్‌లో అపహరణకు గురైన ఐదేళ్ల చిన్నారి ఎట్టకేలకు దొరికింది. పాపను కొడంగల్ పోలీస్‌స్టేషన్‌కు సీఐ నాగేశ్వరరావు తీసుకువచ్చారు. చిన్నారి ఒంటిపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు.
'లంగర్ హౌస్ పాప కొండగల్‌లో దొరికింది...'