తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్ - రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ
15:48 March 22
తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా తెలంగాణనూ.. కలవర పెడుతోంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో 27 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో ఒకరో ఇప్పటికే కోలుకోవడం వల్ల ఇంటికి పంపారు. మిగిలిన 26 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవాళ కరోనా సోకిన వారిలో లండన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చిన యువకుడు(24)కి, లండన్ నుంచి దోహా మీదుగా వచ్చిన 23 ఏళ్ల యువకుడు, స్వీడన్ నుంచి వచ్చిన విద్యార్థి(26), స్వీడన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రాజోలుకు చెందిన యువకుడు, స్వీడన్ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా వ్యక్తి(34), లండన్ నుంచి వచ్చిన 23 ఏళ్ల యువకుడు ఉన్నాడు. దుబాయ్ నుంచి వచ్చిన హైదరాబాద్‌కు చెందిన 50 ఏళ్ల మహిళలో కారోనా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.