ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లు ఇవాళ కేటాయించనున్నారు. కన్వీనర్ కోటాకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 33 కోర్సుల్లో 65,444 సీట్లు ఉండగా... 52,629 మంది మాత్రమే కౌన్సెలింగ్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. సీట్ల కేటాయింపు అనంతరం సుమారు 13 వేల సీట్లు మిగిలిపోనున్నాయి. సీట్లు పొందిన విద్యార్థుల మొబైల్ఫోన్లకు సంక్షిప్త సందేశాల ద్వారా వివరాలు అందుతాయని కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ఈ నెల 15లోగా విద్యార్థులు ఆన్లైన్లో కళాశాలకు వ్యక్తిగతంగా రిపోర్ట్ చేయాలని తెలిపారు.
సంప్రదాయ కోర్సుల వైపే మొగ్గు