కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ మొదటి వర్ధంతి సందర్భంగా... హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన దిల్లీ యూనివర్సిటీ విద్యార్ధి సంఘము అధ్యక్షుడిగా చురుకైనా పాత్ర నిర్వహించారని గుర్తుచేసుకున్నారు. మంచి ప్రతిభశాలి, జాతీయ భావాలను పుణికిపుచ్చుకున్న నాయకుడని పేర్కొన్నారు.
జైట్లీ మేధో సంపత్తి మరువలేనిది: దత్తాత్రేయ - Himachal Pradesh Governor Bandaru Dattatreya
హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దివంగత భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలి వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు. ఆయన మేధో సంపత్తి, వ్యక్తిత్వ వికాసం మరువలేనివని పేర్కొన్నారు. జైట్లీ అనారోగ్యంతో గత ఏడాది ఆగస్టు 24న ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్ను మూశారు.
జైట్లీ మేధో సంపత్తి మరువలేనిది: దత్తాత్రేయ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆయన చాల కీలకమైన పాత్ర నిర్వహించారని తెలిపారు. ఆర్థిక సంస్కరణలు వేగవంతం చేయటంతోపాటు జీఎస్టీ లాంటి సాహసోపేతమైన చర్యలు చేపట్టారని కొనియాడారు.
ఇదీ చదవండి-సెప్టెంబర్ 1 నుంచి మెట్రో రైల్ సర్వీసులు!