బోయిన్పల్లిలోని గోరినగర్లో గల ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాన్స్ ఫార్మర్ పక్కనే చెత్త వేయడం వల్ల మంటలు అంటుకున్నట్లు బోయిన్పల్లి ఏఈ నాయక్ తెలిపారు. వెంటనే మరో ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ట్రాన్స్ఫార్మర్ల పక్కన చెత్త వేయకూడదని ఏఈ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బోయిన్పల్లిలోని ట్రాన్స్ఫార్మర్లో చెలరేగిన మంటలు - fire accident in transformer at boinpally
బోయిన్పల్లి లో ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ట్రాన్స్ ఫార్మర్లో మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
బోయిన్పల్లిలోని ట్రాన్స్ఫార్మర్లో చెలరేగిన మంటలు