Fire Accident at Habsiguda Today : హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరగటం స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. పెద్ద ఎత్తున అగ్నిమాపక శకటాలు, సిబ్బంది రంగంలోకి దిగి.. మంటలను అదుపుచేయటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉప్పల్- సికింద్రాబాద్ మార్గంలోని హబ్సిగూడ వద్ద రోడ్డు పక్కనున్న నాలుగంతస్థుల భవనంలో కింది రెండు అంతస్థుల్లో అన్‌లిమిటెడ్ వస్త్ర దుకాణం, పైరెండంతస్థుల్లో హోటల్ కొనసాగుతున్నాయి. రెండో అంతస్తులో తెల్లవారుజామున మంటలు చెలరేగగా.. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తొలుత రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేసినా.. ఉపయోగం లేకుండా పోయింది. దీంతో మరో 6 శకటాలను రంగంలోకి దించారు. అయినా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. వస్త్రదుకాణం అద్దాలను బుల్డోజర్‌ల సాయంతో పగలగొట్టి.. హైడ్రాలిక్ ఫైర్ ఇంజన్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
Fire Accident at Unlimited Cloth Show Room in Habsiguda: తెల్లవారుజామున ఐదున్నరకి ప్రమాదం జరగ్గా.. 8 ఫైరింజిన్లు, 40 మంది సిబ్బంది సాయంతో మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి మధుసూదన్ రావు తెలిపారు. రెండో అంతస్తులో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని.. ఆస్తి నష్టం ఎంత మేర సంభవించిందనే దానిపై అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మంటలు తగ్గిపోయినా.. వస్త్ర దుకాణం కావడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పరిసర ప్రాంతాలను కమ్మేయటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన భవనం పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో అధికారులు ముందుగానే మూసివేయించారు. రోడ్డు పక్కనే ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం జరగటంతో.. ఉప్పల్ నుంచి హబ్సిగూడ మీదుగా సికింద్రాబాద్‌కు వెళ్లే మార్గంలో కొన్ని గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Hyderabad Fire Accident Today : వనస్థలిపురంలో అగ్ని ప్రమాదం..