తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్బీఐ బ్యాంక్​లో అగ్ని ప్రమాదం.. కంప్యూటర్లు, దస్త్రాలు దగ్ధం - తెలంగాణ వార్తలు

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని ఎస్బీఐ బ్యాంక్​లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా దట్టమైన పొగలతో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Fire accident at SBI Bank in Hyderabad
ఎస్.బి.ఐ బ్యాంక్​లో అగ్ని ప్రమాదం

By

Published : Aug 27, 2021, 11:46 AM IST

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని అజంతా గేట్ దగ్గర ఉన్న ఎస్బీఐ శాఖలో దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. పనివేళలు అయిపోవడంతో సిబ్బంది వెళ్లిపోగా బ్యాంకు మూసివేసి ఉంది. కిటికీలో నుంచి పొగలు రావడాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమతమై బేగంబజార్ పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో... వారు ఘటనా స్థలానికి చేరుకుని ఎగిసి పడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో బ్యాంకులోని ఫర్నీచర్, కంప్యూటర్లు, దస్త్రాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. బ్యాంకు స్ట్రాంగ్ రూమ్​కు ఎలాంటి ముప్పు జరగలేదు. విద్యుదాఘాతం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు.

అగ్ని ప్రమాద దృశ్యాలు

ఇదీ చదవండి:Harish Rao: ఏడున్నరేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశావ్​? ఈటలకు హరీశ్​ ప్రశ్న

ABOUT THE AUTHOR

...view details