ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఇవాళ్టి నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 28 వేల 187 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని విద్యార్థులు ఇవాళ, రేపు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకొని... ఈనెల 26న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలి. ఈనెల 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈనెల 29న తుది విడత సీట్లు కేటాయించనున్నట్లు కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
నేటి నుంచి ఇంజినీరింగ్ తుది విడత కౌన్సిలింగ్
నేటి నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ జరగనుంది. ఈనెల 29న తుది విడత సీట్లు కేటాయించనున్నట్లు కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
మొదటి విడత అనంతరం 16 వేల 432 సీట్లు మిగిలాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల 755 మంది విద్యార్థులు సీటు వచ్చినప్పటికీ కళాశాలల్లో చేరలేదు. వివిధ కాలేజీల్లో సివిల్లో 4 వేల 739, సీఎస్ఈలో 4 వేల 952, ఈసీఈలో 6 వేల 232, ట్రిపుల్ఈలో 4 వేల 880, ఐటీలో 765, మెకానికల్లో 5 వేల 871 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్ ప్రారంభమైన తర్వాత సుమారు 750 సీట్లకు అనుమతులు రావడం వల్ల కన్వీనర్ కోటా సీట్లు 65 వేల 444కి పెరిగాయి. అభ్యర్థులు ఎక్కువ వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి : రేపు ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు