తెలంగాణ

telangana

By

Published : Nov 25, 2022, 9:45 PM IST

ETV Bharat / state

అట్టహాసంగా అట్మాస్ టెక్ ఫెస్ట్.. పాల్గొన్న సినీ నటుడు అడివి శేష్

Adivi Sesh Participated In Atmos Tech Fest: హైదరాబాద్ బిట్స్ పిలాని క్యాంపస్‌లో అట్మాస్ టెక్ ఫెస్ట్ కార్యక్రమం ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 10 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొదటి రోజు వేడుకల్లో సినీ నటుడు అడివి శేష్ పాల్గొన్నారు.

Adivi Sesh participated in Atmos Tech Fest
Adivi Sesh participated in Atmos Tech Fest

Adivi Sesh Participated In Atmos Tech Fest: బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్​లో అట్మాస్ టెక్ ఫెస్ట్ అట్టహాసంగా మొదలైంది. దేశం పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన.. 10 వేల మంది విద్యార్థులు ఈ ఫెస్ట్​లో పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న అట్మాస్ ఫెస్ట్​లో డ్రోన్ మేకింగ్ వర్క్ షాప్​లు, రోబోటిక్ వర్క్ షాపులు జరగనున్నాయి. సినీ నటుడు అడివి శేష్​ హిట్- 2 సినిమా ప్రమోషన్స్​లో... భాగంగా బిట్స్ విద్యార్థులతో కలిసి మొదటి రోజు వేడుకల్లో పాల్గొన్నారు. సినిమాకు సంబంధించి పలు విషయాలు ఆయన విద్యార్థులతో పంచుకున్నారు.

"నేను కాలేజ్​లో క్లాసులు బంక్ కొట్టి షార్ట్ ఫిల్మ్​ తీసుకునేవాళ్లం. మీరు దానిని అనుకరించండి.సాహిత్యం అనేది మా కుటుంబంలో భాగం. తెలుగు సాహిత్యంలో ఒక భాగం. నటన అనేది నాకు చాలా ఇష్టం. అదే నా మొదటి ప్రేమ." - అడివి శేష్​, సినీ నటుడు

అట్టహాసంగా అట్మాస్ టెక్ ఫెస్ట్.. పాల్గొన్న సినీ నటుడు అడివి శేష్

ABOUT THE AUTHOR

...view details