హైదరాబాద్ చంపాపేట్‌లో తెరాస, కాంగ్రెస్ నేతలు పరస్పర దాడులకు దిగారు. చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్‌పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఇటీవల డివిజన్లో మృతిచెందిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కార్పొరేటర్‌కు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే వెళ్లడమే గొడవకు దారి తీసింది.
చంపాపేట్‌లో తెరాస, కాంగ్రెస్ నేతల పరస్పర దాడి
హైదరాబాద్ చంపాపేట్‌లో తెరాస, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అనుచరులు తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని కార్పొరేటర్ రమణా రెడ్డి ఆరోపించారు.
చంపాపేట్‌లో తెరాస, కాంగ్రెస్ నేతల పరస్పర దాడి
తనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధిక ప్రాధాన్యతనిస్తూ తనను అవమానిస్తున్నారని కార్పొరేటర్ సామ రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేశారని తెలిపారు.
ఇవీ చూడండి: సాహసయాత్ర... తండ్రి భయాన్ని ఆ కూతురు జయించేసింది!
TAGGED:
trs and congress leaders