తెలంగాణ

telangana

ETV Bharat / state

Fight: చెక్కుల పంపిణీపై వివాదం... భాజపా-తెరాస మధ్య ఫైట్ - హైదరాబాద్​ తాజా వార్తలు

బోనాల చెక్కుల పంపిణీ ఘర్షణ(Fight)కు దారి తీసిన ఘటన హైదరాబాద్​ ముషీరాబాద్​లో జరిగింది. భాజపా కార్పొరేటర్లకు చెప్పకుండా చెక్కులు పంపిణీ చేశారని కాషాయ శ్రేణులు తెరాస నేతలతో వాగ్వాదానికి దిగాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిని ఒకరు తోసుకున్నారు.

Fight
ఘర్షణ

By

Published : Jul 27, 2021, 4:26 PM IST

Fight: ఘర్షణకు దారి తీసిన చెక్కుల పంపిణీ

హైదరాబాద్​లోని ముషీరాబాద్‌లో తెరాస, భాజపా నేతల మధ్య ఘర్షణ(Fight) జరిగింది. బోనాల పండుగ నిర్వహణ చెక్కుల పంపిణీలో వివాదం ఈ గొడవకు కారణమైంది. భోలక్‌పూర్‌లోని భవానీశంకర్ బోనాల నిర్వహణ చెక్కుల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే ముఠా గోపాల్​ ఆలయంలో చెక్కులు పంపిణీ చేశారు. భాజపా కార్పొరేటర్లకు చెప్పకుండానే చెక్కులు ఇచ్చారని వివాదం చెలరేగింది.

ఉద్రిక్తత

ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ వెళ్లిపోగానే తెరాస, భాజపా కార్యర్తలు వాగ్వాదానికి దిగారు. మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు వారిని వారించడానికి ప్రయత్నించారు. భాజపా కార్యకర్తలు సీఎం కేసీఆర్​ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా తెరాస కార్యకర్తలు నినాదాలు చేశారు. వారి నినాదాలతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది.

ప్రొటోకాల్​ పాటించడం లేదు

ఎమ్మెల్యే ప్రొటోకాల్​ పటించకుండా స్థానికి కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని భాజపా నేతలు నిలదీశారు. బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తే భాజపా వాళ్లు అనవసరంగా గొడవకు దిగారని తెరాస నేతలు అన్నారు. అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:TRS: తెరాస ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ భేటీ

ABOUT THE AUTHOR

...view details