ఆకలి లేని హైదరాబాద్‌ను సాధిద్దాం
హైదరాబాద్‌లో మరో ఆకలి తీర్చే కేంద్రం ఏర్పాటు
మిగిలిపోయిన ఆహార పదార్థాలను వృథాగా పారేయకుండా అవసరమైన వారికి అందిస్తే వారి ఆకలి తీర్చినవారవుతాం. కానీ అలాంటి వారికి ఇచ్చేందుకు సమయం, సందర్భం రాకపోవచ్చు. వారికోసమే "ఫీడ్ ద నీడ్" పేరుతో ఫ్రిడ్జ్‌లను ఏర్పాటు చేసింది ఆపిల్ హోం ఫర్ ఆర్ఫన్ కిడ్స్ సొసైటీ.
ఆకలి లేని హైదరాబాద్‌ను సాధిద్దాం
సురక్షిత పద్ధతుల్లో రిఫ్రిజిరేటర్ ఏర్పాటు చేసి ఎల్లవేళలా ఆకలి తీర్చేలా ఏర్పాట్లు చేయడం శుభపరిణామం. ఆకలి లేని హైదరాబాద్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇప్పటికే రెండు చోట్ల ఫీడ్ ద నీడ్ కేంద్రాలు ప్రారంభించామని ఆపిల్ హోం ఫర్ ఆర్ఫన్స్ కిడ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ నీలిమ ఆర్య అన్నారు. ఆకలితో ఉన్న వారెవరైనా ఈ కేంద్రాలకు వచ్చి ఆహారం ఉచితంగా తీసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.