వెయిట్ లిఫ్టర్ సింధుకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది. సింధు వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో 55 కేజీల విభాగంలో పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పథకాలు సాధించింది. దేవరకద్ర నియోజకవర్గం కొన్నూరుకు చెందిన ఆమె హకీంపేట్ స్పోర్ట్స్ పాఠశాలలో నాలుగు నుంచి 11వ తరగతి వరకు చదువుకుంది. ఆమె తండ్రి పెట్రోల్ బంక్‌లో చిరు ఉద్యోగం చేసేవాడు. అయినా సింధును వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రోత్సహించాడు. తండ్రి కష్టాన్ని చూసిన సింధు ఎంతో పట్టుదలతో కృషి చేసి వెయిట్ లిఫ్టింగ్‌లో పలు బహుమతులు గెల్చుకుంది.
ఫలించిన తండ్రి కష్టం.. జీవితంలో గెలిచిన సింధు - ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో సింధుకు ఉద్యోగం
పెట్రోల్ బంక్‌లో ఉద్యోగం... చాలిచాలని జీతం.. అయినా వెనుకడుగు వేయలేదు. తన కుమార్తెను వెయిట్ లిఫ్టింగ్ రంగంలో ప్రోత్సహించాడు. పరిస్థితులను అర్థం చేసుకున్న కూతురు ఎంతో కష్టపడి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించి ఎన్నో పథకాలు సాధించింది. చివరికి జీవితంలో గెలిచి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించింది.
తాజాగా పశ్చిమ బెంగాల్ కోల్‌కత్తాలోని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో ఈనెల 30న ఉద్యోగంలో చేరాలని సింధుకు కాల్‌లెటర్ వచ్చింది. కూతురుకు ఉద్యోగం రావడం ఎంతో సంతోషంగా ఉందని తండ్రి గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తానూ పడ్డ కష్టాలకు తన కుమార్తెకు ఫలితం లభించిందన్నారు. ఈరోజు సింధు స్వగ్రామమైన అల్లీపురంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి సింధును అభినందించారు. అందరూ సింధును ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణిస్తే ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింధు తండ్రి గోపాల్ రెడ్డి, అల్లీపురం గ్రామ సర్పంచ్ రఘువర్ధన్ గౌడ్, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఒక్కరోజులో 601మందికి కరోనా.. 12మంది మృతి