Fashion Walk In Vizag: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ఫ్యాషన్ వాక్‌ను నిర్వహించారు. విశాఖలో డేజ్లింగ్ బ్యూటీస్ పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్లో 12 మంది మోడల్స్.. పూర్తి వెస్ట్రన్ లుక్‌తో ఆకర్షించారు. భారత సంప్రదాయ దుస్తులతో పాటు.. ప్రపంచంలోని వివిధ దేశాల ఫ్యాషన్ దుస్తులు ధరించి తమ అందాలతో ఫ్యాషన్‌షోకు వన్నె తెచ్చారు. ట్రాఫిక్ నిబంధనలతో ఉన్న ప్లకార్డులు పట్టుకుని ర్యాంప్ వాక్ చేశారు. గతంలో నిర్వహించిన ఫ్యాషన్ వాక్‌లలో విజేతలుగా నిలిచిన వారిని ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వహకులు తెలిపారు.
ట్రాఫిక్ అవెర్నెస్ కోసం.. ముద్దుగుమ్మల ఫ్యాషన్ వాక్ - vizag ramp walk
Fashion Walk In AP: ఏపీలోని విశాఖపట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఫ్యాషన్ వాక్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముద్దుగుమ్మలు ర్యాంప్ వాక్ చేశారు. ట్రాఫిక్‌కు సంబంధించిన నిబంధనలను ఇందులో ప్రదర్శించారు.
విశాఖలో ఫ్యాషన్ షో