ప్రగతిభవన్ ఎదుట ఓ రైతు కుటుంబం ఆత్మాహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన పోలీసులు వారిని రక్షించి అదుపులోకి తీసుకున్నారు. శామీర్‌పేట ఇన్‌స్పెక్టర్ సంతోశ్.. తమ భూమి విషయంలో అన్యాయం చేస్తున్నాడంటూ రైతు భిక్షపతి కుటుంబం ఆరోపించింది. అతని వేధింపులు తట్టుకోలేక భిక్షపతి.. ప్రగతిభవన్ వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు అతనిపై నీళ్లు చల్లి కాపాడారు.
'నన్ను వేధిస్తున్నారు... నేను చనిపోతా సార్'
భూమి విషయంలో ఓ పోలీసు ఉద్యోగి అన్యాయం చేస్తున్నాడంటూ ప్రగతి భవన్ ఎదుట ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. అప్రమత్తమైన పోలీసులు వారిని రక్షించి అదుపులోకి తీసుకున్నారు.
నన్ను వేధిస్తున్నారు... నేను చనిపోతా సార్'
భిక్షపతి వెంట ఉన్న ఆయన భార్య బుచ్చమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శామీర్‌పేట మండలం కొత్తూరు గ్రామంలో ఉన్న 1.30 గుంటల భూమిని వేరే వ్యక్తులకు కట్టబెట్టాలని ఇన్‌స్పెక్టర్ చూస్తున్నాడని బాధిత రైతు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రజల గొంతు వినిపించే అవకాశం ఇవ్వండి: రేవంత్రెడ్డి
Last Updated : Nov 23, 2020, 8:27 PM IST