దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత ప్రముఖ దర్శక నిర్మాత, విజయ బాపినీడు హైదరాబాద్‌లోని స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని చాటపర్రులో 1936 సెప్టెంబర్ 22న జన్మించారు. 22 సినిమాలకు దర్శకత్వం వహించి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్‌బాబు చిత్రాలకు దర్శకత్వం వహించారు. గ్యాంగ్‌లీడర్, బిగ్‌బాస్, మగధీరుడు ,పట్నం వచ్చిన పతివ్రతలు వంటి చిత్రాలు మంచి ప్రాచుర్యం పొందాయి. బొమ్మరిల్లు, విజయ ఇండియన్ ఫిల్మ్, నీలిమ పత్రికలకు సంపాదకత్వం వహించారు. మహానగరంలో మాయగాడు, భార్యామణి, ఫ్యామిలీ, కొడుకులు వంటి చిత్రాలు, ఖైదీ.నెం. 786, సుమంగళి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.