తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారుల సూచనతో అధిక పంట సాగుకు అవకాశం! - తెలంగాణలో నకిలీ విత్తనాలపై వ్యవసాయ అధికారుల దృష్టి

వానాకాలం ప్రారంభం కానున్నందున నకిలీ, నాసిరకం, అక్రమ విత్తనాల సమస్య తీవ్రమవుతోంది. పత్తి సాగు పెంచాలని ప్రభుత్వం సూచించగా.. కొందరు ఇదే అదనుగా నకిలీ, నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్నారు. వీటి విక్రయంపై ఇప్పటికే నిషేధం జారీ చేసినా.. అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వీటిని రైతులు కొనకుండా అడ్డుకోవాలని అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

fke seeds eradication programme in telangana
నకిలీ విత్తనాల పనిపట్టనున్న వ్యవసాయ అధికారులు

By

Published : May 31, 2020, 12:59 PM IST

నకిలీ విత్తనాల బెడద సమస్యాత్మకంగా మారింది. అలాంటి విత్తనాలు వాడకూదని అధికారులు హెచ్చరిస్తున్నా.. కొందరు అక్రమార్కులు వీటిని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలు సాగు చేశాక కలుపు మొక్కలను కూలీలతో తీయించకుండా ఖర్చు మిగుల్చుకునేందుకు రైతులు రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. ఈ క్రమంలో వాటిని చల్లే వారికి క్యాన్సర్​ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నారు.

లూజుగా కొంటున్నారు.. మోసపోతున్నారు..

బీటీ పత్తి విత్తనాలను 450 గ్రాముల చొప్పున ఒక్కో ప్యాకెట్​ చేసి అమ్మాలని సర్కారు సూచించినా.. రైతులకు కిలోల చొప్పున లూజుగా అమ్ముతున్నారు. గత నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇలా లూజుగా అమ్ముతున్న 9,547 క్వింటాళ్ల విత్తనాలను అధికారులు సీజ్​ చేశారు. హైదరాబాద్​ను ఆనుకుని ఉన్న మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలోనూ అక్రమ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. వీటికోసం పోలీసుల, వ్యవసాయ శాఖల అధికారులతో రాష్ట్ర స్థాయి టాస్క్​ ఫోర్స్​ బృందాలను ఏర్పాటు చేశారు.

సీఎం నిర్ణయంతో కదలిక...

అక్రమంగా విక్రయించే వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం గట్టి ఆదేశాలివ్వగా వ్యవసాయశాఖలో కదలిక వచ్చింది. రాష్ట్రంలో విత్తన పత్రి పంట ఎక్కువగా గద్వాలలో సాగు చేశారు. తాజాగా హైదరాబాద్​లో ఓ ప్రైవేటు విత్తన కంపెనీపై పోలీసులు దాడిచేయగా... ఏకంగా రెండు టన్నుల నిషేధిత హెచ్​టీ విత్తనాలు పట్టుబడ్డాయి. ఇవి గద్వాల నుంచి తెచ్చిన నాసిరకమని తేలాయి. ఇంకా పట్టుబడకుండా అమ్మతున్న నకిలీ విత్తనాలు ఎన్నో ఉంటున్నాయని వ్యవసాయ అధికారులే అనధికారికంగా చెబుతున్నారు.

ఇవీ చూడండి:కరోనాను తరిమికొట్టి.. ఆదర్శంగా నిలిచిన పట్టణం

ABOUT THE AUTHOR

...view details