కంప్యూటర్ యుగంలో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో అంతుపట్టని పరిస్థితి. మోసమని గుర్తించే లోపే.. ఖాతాల్లో ఉన్న డబ్బు మాయమై పోతున్నది. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీ నగర్ కాలనీకి చెందిన రాజ్యలక్ష్మి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్నారు. ఇటీవల కాలంలో తమ విద్యాసంస్థల అధినేత పంపినట్లుగా రాజ్యలక్ష్మికి ఓ ఫేక్ మెయిల్ అందింది.
ఫేక్ మెయిల్‌తో మోసానికి పథకం! - సైబర్ క్రైం పోలీసులు
టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత మోసాలు కూడా హైటెక్ స్థాయిలో జరుగుతున్నాయి. దారి కాచి దోచుకునే దొంగలు కూడా తీరు మార్చి.. స్టైల్‌గా ఆన్లైన్లో మోసం చేస్తూ.. అమాయకుల డబ్బు నొక్కేస్తున్నారు. ఫేక్ మెయిల్‌తో డబ్బులు గుంజుదామని ప్రయత్నించిన ఓ మోసాన్ని బాధితురాలు ముందే గుర్తించి అప్రమత్తమైన ఘటన శ్రీనగర్ కాలనీలో చోటు చేసుకుంది.
అందులో సూచించినట్టుగా.. ఒకసారి రూ.70 వేలు, మరోసారి రూ.30 వేల విలువైన అమేజాన్ గిఫ్టు కార్డులు కొని పంపించారు. మళ్లీ రెండు గిఫ్టు కార్డులు పంపాల్సిందిగా.. మరో మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన రాజ్యలక్ష్మి సంస్థ అధినేతకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అలాంటి మెయిల్స్ తానెప్పుడూ చేయలేదని ఆయన చెప్పగా.. వెంటనే ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :'తారక్.. మీ అభిమానులు నన్ను వేధిస్తున్నారు'