ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా ఉత్తర ఒడిశా, పశ్చిమ్ బంగ తీరాల సమీపంలో వాయువ్య బంగాళాఖాతం వద్ద వాయుగుండం కేంద్రీకృతమై ఉందన్నారు. రాగల 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చనుందన్నారు. మరో 48 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, పశ్చిమ్ బంగ తీరాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని అధికారులు స్పష్టం చేశారు. రేపు, ఎల్లుండి అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు.
వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు - తీవ్ర అల్పపీడనం
తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి నేడు మోస్తారు వర్షాలు కురవనున్నాయని భారత వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు.
వాయువ్య బంగాళాఖాతం వద్ద వాయుగుండంతో విస్తారంగా వర్షాలు
ఇవీ చూడండి : జయశంకర్ సార్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం