తెలంగాణ

telangana

ETV Bharat / state

''370 రద్దుతో కశ్మీర్​లో పాక్ ఆటలకు చెల్లు'' - mehabooba mufti

అధికరణం 370 రద్దుతో జమ్ముకశ్మీర్​లో పాకిస్థాన్ ఆటలకు చెక్ పడుతుందని ఆ రాష్ట్ర వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో.. ఇతర రాష్ట్రాల వాళ్లు జమ్ముకశ్మీర్​లో స్వేచ్ఛగా తిరిగే వీలు కలుగుతుందని.. ఇది ఆ రాష్ట్ర ప్రజల్లో ఆర్థిక అభద్రత భావం పెంచే అవకాశం ఉంటుందని విశ్లేషించారు.

''అధికరణం రద్దుతో కశ్మీర్​లో పాక్ ఆటలకు చెల్లు''

By

Published : Aug 5, 2019, 3:52 PM IST

జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న తాజా చర్యలపై.. నిపుణులు స్పందిస్తున్నారు. అధికరణం 370, 35ఏ రద్దుతో ఆ రాష్ట్రంలో ఏర్పడే పరిస్థితులను.. జమ్ముకశ్మీర్ వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ.. ఈటీవీ భారత్​తో తన అభిప్రాయాలు పంచుకున్నారు. పర్యటకంతోనే చాలామాంది జమ్ముకశ్మీరీలు ఉపాధి పొందుతారని చెప్పారు. 370, 35 ఏ రద్దుతో ఇతర రాష్ట్రాల ప్రజలు జమ్ముకశ్మీర్​లో వ్యాపారాలు చేసుకునే వీలు ఉంటుందని.. దీంతో అక్కడి స్థానికుల్లో భయం పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కశ్మీర్ వ్యవహారాల్లో పాకిస్థాన్ జోక్యం ఇకపై తగ్గిపోతుందని.. అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశం చేస్తున్న తప్పుడు వాదనలకు ఇకపై ఆస్కారం ఉండదని చెప్పారు.

''అధికరణం రద్దుతో కశ్మీర్​లో పాక్ ఆటలకు చెల్లు''

ABOUT THE AUTHOR

...view details