హైదరాబాద్ శివారు హయత్‌నగర్ పీహెచ్‌సీ వద్ద గురువారం కరోనా పరీక్షలకు పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చారు. ఉదయం పది గంటల తర్వాత ఎండకు తాళలేక క్యూలో రాళ్లు, చెప్పులు పెట్టి చెట్ల నీడకు వెళ్లారు.
ఓ వైపు నిరీక్షణ.. మరో వైపు క్రమశిక్షణ - telangana news today
కరోనా అనుమానితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. పరీక్షల కోసం ఆస్పత్రుల వద్ద బారులు తీరుతున్నారు. పలు చోట్ల పరీక్షలు చేయడం లేదని వాపోతున్నారు. మరికొన్ని చోట్ల పెద్ద ఎత్తున క్యూ కట్టి టీకా కోసం పోటీ పడుతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా పలు కేంద్రాల్లో మనుషులకు బదులు చెప్పులు, రాళ్లను పెట్టి టెస్టులు చేయించుకుంటున్నారు. అలాంటి కొన్ని దృశ్యాలు ఇక్కడ చుద్దామా.
ఓ వైపు నిరీక్షణ.. మరో వైపు క్రమశిక్షణ
కరోనా టీకా కోసం హైదరాబాద్ రామాంతపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల వద్ద గురువారం జనం ఇలా బారులు తీరారు.