నిత్యం రహదారులపై నిలబడి వాహనాలను నియంత్రించే... ట్రాఫిక్ పోలీసులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని కిమ్స్ ఆసుపత్రి ఎండీ భాస్కర్‌రావు అన్నారు. ప్రపంచ ఫిజియోథెరపి దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ట్రాఫిక్ పోలీసులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని... క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాధుల బారిన పడొద్దొంటే.. వ్యాయామం తప్పనిసరి - ప్రపంచ ఫిజియోథెరపి దినోత్సవం
సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులకు వైద్య అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఆసుపత్రి ఎండీ భాస్కర్‌రావు సూచించారు.
వ్యాధుల బారిన పడద్దొంటే..వ్యాయామం తప్పనిసరి
Last Updated : Sep 7, 2019, 8:46 PM IST