తెలంగాణ

telangana

ETV Bharat / state

'కోటి ఎకరాల్లో వరి అన్న సీఎం.. 40 లక్షలకు ఎందుకు కుదించారు'

రాష్ట్రంలో పేరు కోసమే సీఎం కేసీఆర్​ ప్రాజెక్టులను రీడిజైన్​ చేయిస్తున్నారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో 70 లక్షల ఎకరాల్లో పత్తి వేయాలంటే సీఐఐ అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించారు. నాణ్యత లేకుండా నిర్మాంచారు కాబట్టే కొండపోచమ్మ కాలువకు గండి పడిందన్నారు.

ex mp jithender reddy comments on kcr crores of rice crop decrease 40 lakh acres
'కోటి ఎకరాల్లో వరి అన్న సీఎం.. 40 లక్షలకు ఎందుకు కుదించారు'

By

Published : Jul 2, 2020, 9:48 PM IST

తెలంగాణ ప్రజలు ఎమర్జెన్సీలో బతుకుతున్నారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. రాబోయే కాలంలో తన పేరు చెప్పుకోవాలనే ఆలోచనతోనే కేసీఆర్ ప్రాజెక్టులను రీ-డిజైన్ చేస్తున్నారని ఆరోపించారు. 70 లక్షల ఎకరాల్లో పత్తి వేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు సీఐఐ అనుమతి తీసుకుందా అని ప్రశ్నించారు. కోటి ఎకరాల్లో వరి పండిస్తా అన్న కేసీఆర్ 40 లక్షలకే ఎందుకు కుదించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

800 కోట్లు పెట్టి సచివాలయం

మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి చేయకుండా కొండపోచమ్మకు నీళ్లు ఎందుకు తెచ్చారో చెప్పాలన్నారు. నాణ్యత లేకుండా నిర్మాణం జరిగింది కాబట్టే కొండపోచమ్మ సాగర్ కాలువకు వెంకటాపురం దగ్గర గండి పడిందన్నారు. ఉద్యోగులకు ఇవ్వడానికి నిధులు లేవు కానీ.. 800 కోట్లు పెట్టి సచివాలయం ఎలా నిర్మిస్తారని ఎద్దేవా చేశారు. సాధారణ ప్రజలకు మాత్రమే కరోనా ఆంక్షలా మంత్రులకు ఉండవా అని ప్రశ్నించారు.

వందలాది మందితో

దేశాన్ని పాలించే మోదీనే వీడియో కాల్స్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే తెరాస మంత్రులు వందలాది మందితో కార్యక్రమాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. భాజపా బినామీలకు అడ్రస్ అంటున్న తెరాస నేతలు.. ప్రభుత్వం మీదే కదా వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.

ఇదీ చూడండి :'పోలీసులు కోలుకుని తిరిగి విధుల్లో చేరడం సంతోషం'

ABOUT THE AUTHOR

...view details