తనకు గంట సమయం ఇస్తే చాలని, కేసీఆర్ అవినీతిని బయట పెడతానని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నూరుశాతం తప్పేనని చెప్పారు. అవగాహన లేని ముఖ్యమంత్రి కేసీఆర్ అని ధ్వజమెత్తారు. రాజ్యాంగ పక్రియ ద్వారానే తెలంగాణ వచ్చిందని, దాంట్లో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని పేర్కొన్నారు. అవినీతిపై చర్చించేందుకు ప్రగతిభవన్‌కు రమ్మన్నా, ఎల్బీ స్టేడియానికి రమ్మన్నా వస్తానని చెప్పారు. కేసీఆర్, మంత్రులు, ఇరిగేషన్ అధికారులు అవినీతి నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.
ప్రాజెక్డుల్లో అవినీతిపై చర్చకు సిద్ధమేనా... నాగం - నాగం జనార్ధన్ రెడ్డి
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై చర్చకు సిద్ధమని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి దీనికి సిద్ధమేనా... అంటూ సవాల్ విసిరారు.
"ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై ఎక్కడికైనా వచ్చి చర్చిస్తా"